‘నిత్యావసరాలు సకాలంలో పంపిణీ చేయాలి’

అన్నమయ్య: ప్రభుత్వ చౌకదుకాణాల్లో డీలర్లు సకాలంలో కార్డు వినియోగదారులకు నిత్యవసర సరకులు సకాలంలో పంపిణీ చేయాలని కురబలకోట తహసీల్దార్ ధనుంజయులు గురువారం ఆదేశించారు. కురబలకోట(M)లోని నందిరెడ్డిగారిపల్లె ప్రభుత్వ చౌకదుకాణాన్ని ఆయన తనిఖీ చేశారు. నిత్యావసరాల పంపిణీ రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన తేదిల్లో డీలర్లకు సరకులు పంపిణీ చేయాలన్నారు.