ఎమ్మెల్యే థామస్ నేటి పర్యటన వివరాలు ఇవే..!
CTR: శ్రీరంగరాజపురంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మంగళవారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 11:30 గంటలకు పాలీ హౌస్ అధికారులతో సమావేశం, మధ్యాహ్నం రెండు గంటలకు క్షీరసముద్రం బీసీ కాలనీలో అన్నదాత సుఖీభవ అవగాహన కార్యక్రమం, మధ్యాహ్నం మూడు గంటలకు ఎస్ఆర్ పురం జడ్పీ ఉన్నత పాఠశాలలో సిబ్బందితో సమావేశం అవుతారని వెల్లడించారు.