రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కార్తికేయ ఎంపిక
NZB: కాకతీయ యమున క్యాంపస్ పాఠశాలకు చెందిన విద్యార్థి కార్తికేయ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు కబడ్డీ కోచ్ వినోద్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా కార్తికేయను పాఠశాల డైరెక్టర్ రామోజీ, ప్రిన్సిపల్ గిరిధర్, యజమాన్యం బుధవారం అభినందించారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.