అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

MHBD: పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ శివారులో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన షేక్ సోహెల్ (24) అనే యువకుడు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోహెల్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.