ప్రమాదవశాత్తు రైతు కూలీ మృతి

ప్రమాదవశాత్తు రైతు కూలీ మృతి

అనకాపల్లి: మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామంలో గురువారం ఉదయాన్నే కొబ్బరి బొండాలు వలిచేందుకు కాకి ఈశ్వరరావు అనే రైతు కూలి పదునైన గునపంతో బైక్‌పై వెళుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ క్రమంలో చేతిలో ఉన్న గునపం రైతు తొడ భాగంలోంచి కడుపులోకి దూసుకుపోవడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.