ఆత్మకూరు ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి

ఆత్మకూరు ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి

NDL: ఆత్మకూరు మండలంలో ఆటో బోల్తాపడి ఆదోనికి చెందిన నలుగురు మృతి చెందడంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'శ్రీశైలం దర్శనానికి వెళ్లి, తిరిగొస్తుండగా ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది' అన్నారు.