VIDEO: రూ. 6 లక్షలు గాల్లోకి.. కోతులు ఊర్లోకి: తుమ్మ శ్రీపాల్
MNCL: చెన్నూరు పట్టణంలో కోతులు గుంపులుగా తిరుగుతూ ఇండ్లల్లోకి చొరబడి వస్తువులు, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం, దాడులు చేయడం వంటి సమస్యలను కలిగిస్తున్నాయి. ఇటీవల కోతుల దాడికి పలువురు ఆసుపత్రి పాలయ్యారు. అయితే, ఆసుపత్రిలో సైతం కోతులు రెచ్చిపోతున్నాయని బీజేపీ పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్ ఆరోపించారు. కోతుల పట్టివేతకు రూ.6 లక్షలు నిధులు మంజూరైన ఫలితం శూన్యమని విమర్శించారు.