'నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వర్షాల కారణంగా కాలువలు, వాగులు, వంకలు ప్రవహించే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.