పొదుపుపై అవగాహన సదస్సు
NDL: బనగానపల్లె మండలం పలుకూరు గ్రామ సచివాలయంలో పొదుపుపై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు. పొదుపు భవిష్యత్తుకు భరోసా అని ఆయన తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం లోన్లు అందిస్తోందని ఏపీఎం ఉస్మాన్ హజరత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మహిళలు పాల్గొన్నారు.