'మడకశిరలో త్వరలో సినిమా షూటింగ్'

సత్యసాయి: మడకశిర నియోజకవర్గంలో త్వరలోనే ఓ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని సిని హీరో మంచు మనోజ్ తెలిపారు. శుక్రవారం అయన మాట్లాడుతూ.. మడకశిర వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. చుట్టూ కొండలు, వ్యవసాయ పొలాలు, అడవి ప్రాంతం, పురాతన దేవాలయాలు అన్ని తనకు ఎంతగానో నచ్చాయన్నారు. త్వరలోనే నిర్మాతలు, దర్శకులతో మాట్లాడి ఈ ప్రాంతంలో మంచి సినిమాకు ప్లాన్ చేస్తామని చెప్పారు.