'విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'

SRPT: గణేష్ విగ్రహాలను వాహనాలలో తరలించే క్రమంలో కరెంటు తీగలు గమనిస్తూ వెళ్లాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల్లో ఎవరు కూడా ప్రమాదాల బారిన పడవద్దు అన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ఉత్సాహంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు.