VIDEO: దుర్గాదేవి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

VZM: బొండపల్లి మండలం బోడసింగిపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో దుర్గాదేవి విగ్రహాన్ని శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు ఆ గ్రామ సర్పంచ్ మీసాల జానకిరామ్ తెలిపారు. ఈ ప్రాంతంలో మద్యం షాపులు ఉండటంతో మందుబాబులు ఈ పని చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.