ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన మహిళ మృతి

ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన మహిళ మృతి

HYD: కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బేగంపేట్‌లోని కుందన్ బాగ్లో నివాసం ఉంటున్న పరిణిత సంతానం కోసం ఐవీఎఫ్ చికిత్స చేయించుకునేందుకు మే 31న KPHB కాలనీలోని ప్రసాద్ ఆసుపత్రిలో చేరింది. వైద్యం వికటించి ఆమె మృతిచెందగా పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. విషయం బయట పడకుండా ఆస్పత్రి యాజమాన్యం గోప్యంగా ఉంచారు.