రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలి: MP

రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలి: MP

కోనసీమ: అమలాపురం పార్లమెంటు పరిధిలోని కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ కోరారు. ఆయన కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణం కోనసీమ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని ఆయనకు వివరించారు. ఇప్పటివరకు జరిగిన రైల్వే లైన్ పనుల గురించి ఆయన మంత్రికి వివరాలు తెలియజేశారు.