కర్లపాలెంలో 17న ఉచిత నేత్ర వైద్య శిబిరం

BPT: కర్లపాలెం పెద్దింటమ్మ ఆలయ ప్రాంగణంలో ఈ నెల 17న ప్రముఖ నేత్ర వైద్యశాల వైద్యులతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తుమ్మల శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 1 వరకు శిబిరం నిర్వహిస్తామన్నారు. ఈ శిబిరానికి వచ్చే వారు ఆధార్, ఫోన్ నంబర్ తెచ్చుకోవాలని సూచించారు.