ల్యాండ్ అవుతుండగా గోడను ఢీకొన్న విమానం

ల్యాండ్ అవుతుండగా గోడను ఢీకొన్న విమానం

యూపీలోని అలీఘర్ ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. పయనీర్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై సరిహద్దును ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ పైలట్ తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసినట్లు విమానయాన శాఖ డైరెక్టర్ ఎస్ ఎస్ అగర్వాల్ తెలిపారు.