పోలీసుల 'కార్డెన్ సెర్చ్'.. 5 బైకులు స్వాధీనం

CTR: గూడూరు రూరల్ పరిధిలోని టిడ్కో ఇళ్ల వద్ద ఆదివారం ఉదయం ఎస్సై మనోజుమార్ ఆధ్వర్యంలో పోలీసులు 'కార్డెన్ సెర్చ్' నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పత్రాలు లేని 5 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లలో గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత మత్తు పదార్థాల విక్రయం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.