నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న దామచర్ల సత్య

జరుగుమల్లి మండలంలోని చిర్రికూరపాడు గ్రామంలో ఆదివారం అంకమ్మ అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.