వైభవంగా శ్రీస్వామి వారి కళ్యాణోత్సవం

NTR: నందిగామ పట్టణంలోని స్వయంభు దేవాలయం శ్రీ శుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాఘ శుద్ధ చతుర్దశి సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం అత్యంత శోభాయమానంగా నిర్వహించారు. మొదటగా ఆలయమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉత్సవ విగ్రహాలను నంది వాహనంపై ఊరేగుతూ ఎదుర్కోళ్ల ఉత్సవం నిర్వహించారు.