VIDEO: 'వీరికి దివ్యాంగుల పెన్షన్ ఇవ్వాలి'
MNCL: తలసేమియా, సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు దివ్యాంగుల పెన్షన్ ఇవ్వాలని తలసేమియా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాలో 5 వేల మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారని తెలిపారు. వారికి వికలాంగుల బిల్లు - 2016 చట్టాలు అమలు చేయాలని కోరారు.