అలంకారప్రాయంగా మంచినీటి కొళాయిలు

BPT: కొరిశపాడు మండలం మేదరమెట్లలోని మార్కెట్ యార్డ్ నందు రైతుల దాహార్తి కోసం గతంలో ఏర్పాటు చేసిన మంచినీటి కొళాయిలు నేడు నిరుపయోగంగా మారాయి. యార్డ్ లోపల రైతు భరోసా కేంద్రం, సంత వంటివి జరుగుతున్నప్పటికీ కొళాయిలు పనిచేయకపోవడంతో అవి అలంకార ప్రాయంగానే మిగిలిపోయాయి. దీనిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికా ప్రజలు కోరుతున్నారు.