'బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దుచేయాలి'

NGKL: పదేళ్ల పాలనలో హామీలను అమలు చేయని BRS పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎంపీ మల్లు రవి ఎన్నికల సంఘాన్ని కోరారు. హామీల అమలు చెయ్యని పార్టీల గుర్తింపు రద్దు చేయాలని కేటీఆర్ ECని కలిసిన సందర్భంగా ఎంపీ స్పందించారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రైతురుణమాఫీ, నీళ్లు, నిధులు, నియామకాలు, నిరుద్యోగభృతి, కేజీ టు పీజీ, దళితులకు 3 ఎకరాల భూమి తదితర హామీలు అమలు చెయ్యలేదన్నారు.