యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దు : ఎస్సై

యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దు : ఎస్సై

ASF: యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని కెరమెరి ఎస్సై మధుకర్ ప్రకటనలో తెలిపారు. మండలంలోని యువత డ్రగ్స్, గుడుంబాకు దూరంగా ఉండాలన్నారు. ఒక్క క్షణం మత్తు జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు. డ్రగ్స్ తీసుకోవడం చట్టరీత్యా నేరమని, శిక్ష తప్పదని హెచ్చరించారు. డ్రగ్స్ నివారణ, సహాయం కోసం టోల్ ఫ్రీ 1908 నంబర్ కి ఫోన్ చేయాలన్నారు.