తొర్రూరు మున్సిపల్ ఎన్నికల బరిలో సీపీఐ

తొర్రూరు మున్సిపల్ ఎన్నికల బరిలో సీపీఐ

MHBD: రాబోయే తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు వార్డులలో పోటీ చేయాలని సీపీఐ అధిష్టానం నిర్ణయించిందని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు ఓమ బిక్షపతి తెలిపారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజాదారణ కలిగిన నాయకులను బరిలో నిలిపి నాలుగు వార్డులలో విజయం సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.