కార్మికుల అభివృద్ధే గ్రామీణాభివృద్ధికి పునాది: గిడ్డి

కోనసీమ: కార్మికుల అభివృద్ధే గ్రామీణాభివృద్ధికి పునాది అని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. మేడే సందర్భంగా పి.గన్నవరంలో గురువారం నిర్వహించిన కొబ్బరి వలపు కార్మికుల ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. శ్రమకు గౌరవం ఇవ్వాలని అన్నారు. కార్మికుల సంక్షేమానికి సహకారాన్ని ప్రభుత్వం ద్వారా అందించేందుకు కృషి చేస్తానన్నారు.