BREAKING: ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. షఫాలీ వర్మ(87), దీప్తి శర్మ(58) అద్భుత ప్రదర్శన చేయగా.. స్మృతి మంధాన(45), రీచా(34) రాణించారు. జెమిమా(24), హర్మన్‌ప్రీత్(20) తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. దీంతో, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. SA బౌలర్లలో ఖాకా 3 వికెట్లు తీసింది.