యువకుడిపై బ్లేడ్‌తో దాడి..కేసు నమోదు

యువకుడిపై బ్లేడ్‌తో దాడి..కేసు నమోదు

గుంటూరు: పట్టణంలో యువకుడిపై బ్లేడ్‌తో దాడి చేసిన ఘటనపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. కేవీపీ కాలనీకి చెందిన సురేందర్ మద్యం తాగి తన భార్య షఫీని కొడుతుండగా ఆమె సోదరుడు ఫయాజ్ అడ్డుగా వెళ్లాడు. నా చెల్లిని ఎందుకు కొడుతున్నావు అని నిలదీశాడు. దీంతో సురేందర్ బ్లేడు తీసుకొని ఫయాజ్‌పై దాడి చేశాడు. ఫయాజ్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.