శ్రీశైలంలో వైభవంగా మల్లన్న వెండి రథోత్సవం
నంద్యాల: శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు సాయంత్రం వెండి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవను చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ఆశీన్నులను చేసి, అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు జరిపించారు.