కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

GDWL: అయిజ మండల కేంద్రానికి చెందిన శ్రీను గౌడ్ సోమవారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. మల్దకల్ మండలం నాగర్ దొడ్డి శివారులోని వ్యవసాయ పొలంలో విద్యుత్ తీగలు తెగిపడగా సరి చేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్ ఆఫ్ చేశాడు. తీగలు సరిచేసుకొని తిరిగి ట్రాన్స్‌ఫార్మర్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు.