రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల్లో 3వ స్థానం

VZM: 6వ రాష్ట్ర స్థాయి పారా జూనియర్, సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో విజయనగరం జిల్లా 3వ స్థానం సాధించి, ట్రోఫీని అందుకోవడం జిల్లాకు గర్వకారణమని ఆ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె. దయానంద్ ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. విశాఖ వేదికగా నిర్వహించిన ఈ పోటీల్లో గతం కంటే పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబర్చారన్నారు.