'మహిళల అభ్యున్నతే సీఎం చంద్రబాబు లక్ష్యం'

సత్యసాయి: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. పుట్టపర్తిలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, జిల్లా కలెక్టర్ చేతన్‌లతో కలసి ఉచిత బస్సు ప్రయాణం బస్సులను మంత్రి సవిత శుక్రవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.