మద్యం సేవించి వాహనాలను నడపవద్దు: SI
MHBD: మద్యం సేవించి వాహనాలు నడపొద్దని తొర్రూర్ ఎస్సై ఉపేందర్ హెచ్చరించారు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి పై సంచరించే గ్రానైట్ లారీ డ్రైవర్లకు ఇవాళ దుబ్బ తండా వద్ద SI ఉపేందర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అధిక బరువు, అతివేగంతో వాహనాలు నడపకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ చర్య రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఉపయోగపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.