స్వామివారికి 350 గ్రాముల వెండి త్రిశూలం వితరణ

స్వామివారికి 350 గ్రాముల వెండి త్రిశూలం వితరణ

NDL: పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో ఇవాళ వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెంకట లక్ష్మయ్య అనే భక్తుడు 350 గ్రాముల వెండి త్రిశూలాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. వెంకట లక్ష్మయ్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం త్రిశూలం ఇచ్చిన దాత వెంకట లక్ష్మయ్యకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను ఇచ్చారు.