VIDEO: కుంగిన ఫ్లోరింగ్.. ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
SRCL: వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద పరిశీలిస్తుండగా బేస్ మీదకి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెళ్లారు. ఒక్కసారిగా బేస్‌మెంట్ కుంగింది. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే అందులో పడబోతుండగా నాయకులు అయన్ను పట్టుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.