అక్రమ ఇసుక రవాణా.. ట్రాక్టర్ సీజ్

అక్రమ ఇసుక రవాణా.. ట్రాక్టర్ సీజ్

SRPT: అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టరును శనివారం పోలీసులు పట్టుకున్నారు. జాజిరెడ్డిగూడెంకు చెందిన శీలం లక్ష్మయ్య తన ట్రాక్టర్ (TG 29 1616)లో ఇసుక తరలిస్తుండగా.. గోరంట్ల స్టేజీ వద్ద పోలీసులు తనిఖీల్లో పట్టుబడ్డాడు. దీంతో టాక్టర్‌ను సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు మద్దిరాల ఎస్సై వీరన్న తెలిపారు.