VIDEO: ప్రభుత్వ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి
HYD: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సరికొత్త ఈవీ పాలసీని తీసుకువచ్చిందన్నారు. ఆదర్శ మారుతి సుజుకి నెక్సా ద్వారా e VITARA ఎలక్ట్రిక్ కార్లను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.