కేరళలో జుక్కల్ ఎమ్మెల్యే ప్రచారం
KMR: కేరళలోని అడూర్ నియోజకవర్గ ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుడిగా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఎజంకులంలో జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని, గెలుపు వ్యూహాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి స్థానిక నేతలతో వరుస భేటీలు నిర్వహించారు.