లోయలో పడ్డ టిప్పర్.. డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు

లోయలో పడ్డ టిప్పర్.. డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు

NDL: బనగానపల్లె మండలం పల్లాపురం గ్రామం వద్ద ప్రమాదవశాత్తు టిప్పర్ బ్రిడ్జి వద్ద లోయలో పడినట్లు పోలీసులు తెలిపారు. గురువారం పల్లాపురం గ్రామం వద్ద టిప్పర్ బ్రిడ్జిని ఢీ కొట్టి డ్రైవర్‌కు, క్లీనర్‌కు గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.