'వాల్మీకి బోయలను విస్మరించిన బీఆర్ఎస్'

MBNR: గత BRS ప్రభుత్వ పదేళ్ల పాలనలో వాల్మీకి బోయలను విస్మరించారని సంఘం నేతలు కొండన్న, కురుమూర్తి, వెంకట్‌లు విమర్శించారు. అడ్డాకులలో వాల్మీకి కమ్యూనిటీ భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.