పటాన్ చెరు డివిజన్ కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ మెట్టు
SRD: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని APR లక్జురియ కాలనీలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీవాసులతో సమావేశమై స్థానిక సమస్యలను పరిశీలించారు. కాలనీలో చేపట్టిన బీ.టీ రోడ్డు నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం కాలనీలోని బహిరంగ వ్యాయామశాల పరిసరాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు.