'చనిపోతూ మరికొందరికి ప్రాణం పోశాడు'

WG: వీరవాసరం మండలానికి చెందిన పోలిశెట్టి సుబ్రహ్మణ్యం రెండో కుమారుడు రేవంత్ (19) ఈ నెల 21న కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో యువకుడిని కాకినాడలోని ఓ ఆసుపత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపారు. తమ కుమారుడు తమకు దక్కడని అతని అవయవాలు దానం చేసి మరికొందరికి ప్రాణం పోసేందుకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.