రిపేర్లను వేసవి సెలవుల్లోపు పూర్తి చేయాలి: కలెక్టర్

రిపేర్లను వేసవి సెలవుల్లోపు పూర్తి చేయాలి: కలెక్టర్

NLG: నల్గొండ లోని మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా వసతులను పరిశీలించిన ఆయన, పాఠశాలలో మైనర్, మేజర్ రిపేర్లను వేసవి సెలవుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. వంటగది పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని, ఎక్స్‌పైరీ డేట్ సరుకులను తొలగించాలన్నారు.