గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
MBNR: ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సోమవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో చిరు వ్యాపారులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు.