రైతు బీమాకు 7100 మంది దరఖాస్తులు

రైతు బీమాకు 7100 మంది దరఖాస్తులు

MDK: రైతు బీమా కోసం మెదక్ జిల్లాలో 7100 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని చెప్పారు. ఏ కారణం చేతనైన రైతు మరణిస్తే నామిని ఖాతాలో ఐదు లక్షల రూపాయలు జమవుతాయని పేర్కొన్నారు.