ఒంగేలు పోలీస్ స్టేషన్లో అభిమానుల ఫిర్యాదు
ప్రకాశం: ఒంగేలు తాలుకా పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తిపై బాలకృష్ణ అభిమానులు ఫిర్యాదు చేశారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సొహైల్ అహ్మద్ అనే వ్యక్తిపై ఒంగేలు తాలుకా పోలీస్ స్టేషన్లో అభిమానులు ఫిర్యాదు చేశారు. అభిమానుల మనోభావాలను దెబ్బతీసిన అహ్మద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌బీకే అభిమాన సంఘం నేతలు కోరారు.