'గ్రామస్థాయిలో వైసీపీని బలోపేతం చేయాలి'
E.G: గ్రామస్థాయిలో వైసీపీని బలోపేతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తి వైసీపీ కార్యాలయంలో 4 మండలాల వైసీపీ కన్వీనర్లు ముఖ్య నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలోని వైసీపీ గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలను పూర్తి చేయాలని మండల కన్వీనర్లకు సూచించారు.