గ్రామాన్ని విలీనం చేయవద్దని తీర్మానం

VKB: పరిగి మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో మంగళవారం గ్రామ పెద్దలు వివిధ పార్టీల నాయకులు సమావేశమయ్యారు. నస్కల్ గ్రామాన్ని పరిగి మున్సిపాలిటీలో విలీనం చేస్తారనే నేపథ్యంలో సమావేశమైనట్లు తెలిపారు. నస్కల్ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయకూడదని విలీనం చేస్తే గ్రామానికి వచ్చే ఆదాయం పోవడమే కాకుండా ఉపాధి హామీ పనులు లేకుండా పోతాయని తెలిపారు.