యువతిపై పైశాచిక దాడి

యువతిపై పైశాచిక దాడి

HYD: పంజాగుట్ట PS పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. గుంటూరుకు చెందిన యువతిపై భానుప్రకాశ్ అనే యువకుడు పైశాచికంగా దాడి చేశాడు. ఒకే కంపెనీలో పనిచేసే భానుప్రకాశ్, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాక, గోళ్లు పీకి, కత్తెరతో ప్రైవేట్ భాగాలపై దాడి చేశాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.