క్షమాపణ చెప్పిన యాంకర్ శివజ్యోతి

క్షమాపణ చెప్పిన యాంకర్ శివజ్యోతి

తిరుమల ప్రసాదంపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల యాంకర్ శివజ్యోతి క్షమాపణలు చెప్పారు. తప్పుడు ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. రూ.10 వేల క్యూలైన్లో నిల్చున్నామనే ఉద్దేశంతో మాత్రమే అలా మాట్లాడానని వివరించారు. ఆ వ్యాఖ్యలపై తన తమ్ముడు తరఫున కూడా అందరికీ క్షమాపణలు చెబుతున్నట్లు వీడియో విడుదల చేశారు. తాము అనుభవించేది అంతా వెంకన్న దయవల్లే అని ఆమె స్పష్టం చేశారు.