ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

MHBD: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా జిల్లా ఆసుపత్రిని సోమవారం తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, శుభ్రత, ఔషధాల లభ్యతపై సమీక్ష నిర్వహించారు. అనంతరం డాక్టర్లు, సిబ్బంది విధి నిర్వహణపై సూచనలు ఇచ్చి, లోపాలను వెంటనే సరిచేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని తెలిపారు.